Telugu Ayurveda Chitkalu

Ayurvedic Tips in Telugu

          ఆయుర్వేదం సంప్రదాయంగా పురాతన కాలం నుండి వొస్తున్న చవకైన, విలువైన వైద్య విధానం. ఇతర వైద్య విధానాలతో పోల్చితే ఆయుర్వేదం మనపై ఎటువంటి దుష్ప్రభావాలను చూపదు, అది ఆయుర్వేదం యొక్క గొప్ప లక్షణం.

          మనం తరుచుగా ఎదుర్కొనే శరీర సమస్యలకు కొన్ని ఆయుర్వేద పరిష్కారాలు క్రింద ఇవ్వబడ్డాయి.

జలుబు :

» ఒక కప్పు పాలలో ఒక చెంచా పసుపు పొడిని కలిపి, తీసుకుంటే జలుబు, పడిసెము తగ్గుతాయి.

» ఒక గ్లాసు అనాసపండు రసంలో మిరియాలపొడి, ఉప్పు కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది.

» తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గిపోతాయి.

» మిరియాలపొడి, పెరుగును కలిపి తింటే జలుబు తగ్గుతుంది.


దగ్గు :

» నిప్పుల మీద వామును వేసి దాని పొగను పిలిస్తే దగ్గు తగ్గుతుంది.

» అరటిపండు మధ్యలో మిరియాల పొడిని వేసి తింటే దగ్గు తగ్గుతుంది.

» పసుపు కొమ్ములను వేయించి చిన్న ముక్కలుగా కొట్టి రెండు ముక్కలను దవడలో పెట్టుకొని రసాన్ని మింగటం వల్ల దగ్గు తగ్గిపోతుంది.

» లవంగంను కాల్చి పొడి చేసి కొద్దికొద్దిగా తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.



నిద్ర :

» కొద్దిగా వేడి చేసిన గసగసాలను బట్టలో మూట కట్టి వాసన చుస్తే నిద్ర వస్తుంది.

» కురాసాని వామును నిప్పులపై వేసి పొగను పీలిస్తే నిద్ర బాగా వస్తుంది.

» ప్రతీ రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి నిమ్మకాయ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే మంచి నిద్ర పడుతుంది.

» పడుకునేటప్పుడు వేడి పాలలో కొంచెం తేనే వేసుకొని తాగితే మంచి నిద్ర పడుతుంది.

Page-1