Telugu Ayurveda Chitkalu

Ayurvedic Tips in Telugu

నీరసము :

» తియ్యటి అరటిపండును గాని, ఉసిరికాయలను కానీ, నల్లద్రాక్ష పండ్లను కానీ తీసుకుంటే నీరసం తగ్గిపోయి బలం వస్తుంది.

» మూడు వంతుల తేనె, ఒక వంతు నీరుల్లిపాయ రసంలో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది.

» ఉప్పు, మిరియాలపొడి, పచ్చిద్రక్ష ఈ మూడింటిని కలిపి తీసుకుంటే నీరసం తగ్గుతుంది.


గాయాలు :

» రెండు మూడు చుక్కల తమలపాకుల రసాన్ని గాయం పైన వేస్తె గాయం చీము పట్టకుండా త్వరగా తగ్గిపోతుంది.

» మామిడి చెట్టు బెరడు రసాన్ని తెగిన గాయాలపై రాస్తే రక్తం ఆగి గాయం తొందరగా మానుతుంది.

» లేత కొబ్బరి నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా సున్నపు తేటను కలిపి గాయాలపై రాస్తే త్వరగా తగ్గుతాయి.



అజీర్ణము :

» ద్రాక్ష పళ్ళు మరియు కరక్కాయ పెచ్చులు రెండింటిని సమానంగా కలిపి తేనెతో బాగా నూరాలి, ఈ మిశ్రమాన్ని ఉసిరికాయ సైజులో మాత్రలుగా చేసి రోజూ రెండు పూటలు వేడి నీటితో తీసుకుంటే అజీర్ణము తగ్గుతుంది.

» శొంఠి మరియు బెల్లాన్ని కలిపి నూరిన చూర్ణాన్ని ఉప్పు నీటిలో కలిపి తాగితే అజీర్ణము తగ్గుతుంది.

» జీలకర్ర, వాము, పిప్పళ్లు, శొంఠి వీటిని అన్నింటినీ ఒకే పరిమాణంలో తీసుకొని పొడిగా చేయాలి. ఈ మిశ్రమానికి అంతే పరిమాణంలో బెల్లాన్ని కలిపి రోజూ రెండు పూటలు తీసుకుంటే అజీర్ణము తగ్గుతుంది.

Page-2