Telugu Ayurveda Chitkalu

Ayurvedic Tips in Telugu

మలబద్ధకం :

» ఖర్జూరం, మేడి పండ్లు, క్యాబేజీలను బాగా తినడం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది.

» వెన్న, నెయ్యిలను అన్నంలో కలుపుకొని క్రమంగా తినటం వల్ల మలబద్దకం తగ్గిపోతుంది.

» శొంఠి, కరక్కాయ, పిప్పళ్ళను సమానంగా కలిపి పొడిగా చేసి బెల్లంతో కలిపి తీసుకోవటం ద్వారా మలబద్దకం తగ్గుతుంది.


వాంతులు :

» నిమ్మరసం తాగటం వల్ల చిన్న పిల్లలకు, పెద్దవారికీ, ప్రయాణాలలో తరుచుగా అయ్యే వాంతులు ఆగిపోతాయి.

» తినే సోడా ఉప్పు కలిపిన నీటిలో వామును కలిపి త్రాగితే వాంతులు తగ్గిపోతాయి.

» దానిమ్మ గింజలు తినడం, నీరుల్లి వాసన చూడటం ద్వారా కూడా వాంతులు తగ్గుతాయి.



లావు :

» బార్లీ బియ్యం యొక్క పిండితో చేసిన రొట్టెలను రోజూ తీసుకునే ఆహారానికి బదులుగా తీసుకుంటే లావు తగ్గుతారు.

» ఉదయాన్నే ప్రతీ రోజు నీటిలో ఒకటి రెండు స్పూనుల తేనెను కలిపి క్రమంగా తీసుకుంటే లావు తగ్గవచ్చు.

Page-3