Telugu Ayurveda Chitkalu
Ayurvedic Tips in Telugu
బలం పొందటానికి :
» ప్రతీ రోజూ ఉదయాన్నే నల్ల నువ్వులు లేదా మర్రి పండు గింజలను లేదా అప్పుడే తీసిన వెన్నను తినటం ద్వారా బలాన్ని పెంచుకోవచ్చు.
» తుమ్మ చెట్టు పట్ట చూర్ణమును రోజూ రెండు పూటలు నెయ్యిలో కలుపుకొని తినటం ద్వారా శరీరానికి బలం వస్తుంది.
» ఖర్జురపు పండ్లను నీటిలో నానబెట్టి బాగా నలిపి ఆ నీటిని తాగటం వల్ల శారీరక బలాన్ని పెంచుకోవచ్చు.
పంటి నొప్పి :
» పసుపు కొమ్మును కాల్చి, బూడిదగా మార్చి ఆ పొడితో పళ్ళు తోమితే పంటి నొప్పులు తగ్గిపోతాయి.
» పుచ్చు పళ్ళ మీద మర్రిపాలను చుక్కలుగా వేస్తే క్రిములు నశించి నొప్పి తగ్గుతుంది.
» కర్పూర తైలంలో దూదిని ముంచి పంటి పుప్పి పంటి పైన పెడితే పన్ను నొప్పి తగ్గుతుంది.
» నిమ్మ రసంలో ఇంగువను కలిపి కొద్దిగా వేడిచేసి దూదితో పంటి పైన పెడితే నొప్పి తగ్గిపోతుంది.
దురదలు :
» కొబ్బరి నూనెలో వేపాకు రసం వేసి వేడిచేసి రాస్తే దురద తగ్గిపోతుంది.
» వేప చిగురు, పసుపు లను మంచిగా నూరి దురద ఉన్న చోటున రాస్తే దురద తగ్గుతుంది.
» మిరియాలు, వేపాకు లను కలిపి నూరి ఆ మిశ్రమాన్ని తింటే దురద తగ్గిపోతుంది.