Bathukamma
బతుకమ్మ
బతుకమ్మ పండుగ తెలుగులో
Bathukamma in Telugu
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు జరుపుకునే పుష్పవల్లుల పండుగ "బతుకమ్మ పండుగ". తెలంగాణ రాష్ట్ర పండుగగా 2014 June 16 న బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
బతుకమ్మ పండుగ చరిత్ర
History of Bathukamma
బతుకమ్మ పండుగకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. మార్కండేయ పురాణం గాథా సప్తశతి లోని ఒక కథ ప్రకారం, మహిషాసురున్ని సంహరించి బాగా అలసిపోయిన గౌరీదేవి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున నిద్రించి, దశమి నాడు మేల్కొంటుంది. గౌరీ మాత లేవగానే అప్పటికే ప్రాణాలు కోల్పోయిన రాక్షస పీడితులందరు గౌరీ దేవి దయ వల్ల తిరిగి బ్రతుకుతారు. అప్పటినుండి తొమ్మిదిరోజులు గౌరీ దేవిని పూలతో అలంకరించి బతుకమ్మ పేరుతో పూజించటం సంప్రదాయంగా మారింది.
ఇలా ప్రచారంలో ఉన్న ఇంకొక కథ ప్రకారం, "ఒక బాలిక" భూస్వాముల అఘాయిత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ బాలిక గుర్తుగా ఆ గ్రామస్తులు "బతుకమ్మ" పేరుతో ఉత్సవం జరపటం జరుగుతూ వస్తుంది.
బతుకమ్మను పేర్చడం
Bathukamma Preparation
గుమ్మడి పూవులు + గుమ్మడి ఆకును ఇత్తడి స్తాంబాలంలో క్రింది వరుసలో ఉంచుతారు. వాటిపైన గునుగు పూలు, చామంతి పూలు, బంతిపూలు వరుసలో పేరుస్తారు. పైన పసుపు ముద్దతో గౌరమ్మను చేసి దీపం పెట్టి పూజిస్తారు.
ఇలా తయారు చేసిన బతుకమ్మను సాయంకాలం ఆరుబయట ఉంచి, చుట్టూ మహిళలు, అమ్మాయిలు చప్పట్లు కొడుతూ, తిరుగుతూ, జానపదాలు పాడుతూ పరవశిస్తారు.
సద్దుల బతుకమ్మ రోజు చీకటిపడిన తర్వాత బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. చక్కర, జొన్నరొట్టెతో చేసిన మలిద ముద్దలను ప్రసాదంగా స్వీకరిస్తారు.
ఈ పండుగ జరిపే తొమ్మిది రోజులను తొమ్మిది పేర్లతో పిలుస్తారు.
బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు
Nine Days in Bathukamma Festival
1. మొదటి రోజు / ఎంగిలిపూల బతుకమ్మ:
పెత్తరమాస నాడు దీన్ని జరుపుకుంటారు, ఈ రోజు పెద్దలకు పూజించి బ్రాహ్మణులకు బియ్యం మరియు కూరగాయలు దానం చేస్తారు.
ముందురోజే పూలను కోసి తెస్తారు కాబట్టి ఈ రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. సాయంత్రం బతుకమ్మను చేసి మధ్యలో గౌరమ్మను ఉంచి, జానపదాలను పాడుతూ, ఆడుతూ మహిళలు బతుకమ్మను పూజిస్తారు, ఈ రోజు నువ్వులు+నూకలు+బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు.
2. రెండవ రోజు / అటుకుల బతుకమ్మ:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, సప్పటి పప్పు+బెల్లం+అటుకులు కలిపి ప్రసాదంగా ఉంచుతారు.
3. మూడవ రోజు / ముద్దపప్పు బతుకమ్మ:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, ఈ రోజు బెల్లం+పాలు ప్రసాదంగా ఉంచుతారు.
4. నాలుగవ రోజు / నానబియ్యం బతుకమ్మ:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, మానేసిన బియ్యం+బెల్లం ముద్దలుగా చేసి ప్రసాదంగా పెడతారు.
5. ఐదవ రోజు / అట్ల బతుకమ్మ:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, అట్లు లేదా దోశలు ప్రసాదంగా పెడతారు.
6. ఆరవ రోజు / అలిగిన బతుకమ్మ:
ఈ రోజు బతుకమ్మ ఆడరు, మరియు ప్రసాదం ఉండదు కాబట్టి అలిగిన బతుకమ్మ అని అంటారు.
7. ఏడవ రోజు / వేపకాయల బతుకమ్మ:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, బియ్యం పిండిని వేపకాయలలాగా చేసి ప్రసాదంగా పెడతారు.
8. ఎనిమిదవ రోజు / వెన్న ముద్దల బతుకమ్మ:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, నువ్వులు+వెన్న+బెల్లం+నెయ్యి కలిపి ముద్దలుగా చేసి ప్రసాదంగా పెడతారు.
9. తొమ్మిదవ రోజు / సద్దుల బతుకమ్మ:
ఈ రోజు బతుకమ్మను పేర్చి, సద్దులైన పెరుగన్నం, పులిహోర, చిత్రన్నం, కొబ్బెరన్నం, నువ్వులన్నం వంటి 5 రకాల ప్రసాదాలు పెడతారు. కొందరు మలిద ముద్దలు కూడా పెడతారు.
శాస్త్రీయంగా బతుకమ్మ ప్రాముఖ్యత
Scientific Advantages of Bathukamma
» బతుకమ్మలను చెరువులో నిమర్జనం చేయడంవల్ల తంగేడు, గునుగు, చామంతి, బంతి పూలలో ఉన్న ఔషధ గుణాల వలన త్రాగు నీరులోని సూక్ష్మ క్రిములు చనిపోతాయి.
» తొమ్మిది రోజుల బతుకమ్మ ప్రసాదాల వల్ల Fe, Ca వంటి పోషక విలువలు మనకు లభిస్తాయి.
» సాయంత్రం బతుకమ్మ ఆడటం వల్ల మహిళల వ్యక్తిత్వ వికాసం, శారీరక పటుత్వం పెరుగుతాయి.
బతుకమ్మ బోనాలు దసరా దీపావళి సంక్రాంతి ఉగాది మహా శివరాత్రి మేడారం సమ్మక్క సారక్క జాతర మరిన్ని ..