Bonalu

బోనాలు

బోనాల పండుగ తెలుగులో

Bonalu Festival in Telugu

          తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మన రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగతో పాటు బోనాలను కూడా 2014 జూన్ 16 న రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

          తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే బోనాల పండుగను ఆషాడ మాసం, తొలి ఆదివారం నాడు ప్రారంభిస్తారు. ఆషాడ మాసం బోనాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది.

బోనాలు చరిత్ర

History of Bonalu

          1869 వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలు మలేరియా వ్యాధికి గురై చాల మంది చనిపోవడం జరిగింది. మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తే వారికి మంచి జరుగుతుందని నమ్మేవారు. అప్పటినుండి బోనాలు జరుపుతున్నారని వినికిడి.

          ఇంకో కథనం ప్రకారం 1908 వ సంవత్సరంలో మూసీ నది పొంగి నగరవాసులు చాల మంది ప్రాణాలు వదిలారు. నది ఉద్రిక్తత తగ్గటానికి అప్పటి నిజం రాజు నీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారికి బంగారు చాటలో పట్టుచీర, గాజులు, ముత్యాలు, పసుపు కుంకుమ లను సమర్పించారు. ప్రజలు బోనాలను సమర్పించారు, అప్పుడు నది పొంగటం ఆగిందని, అప్పటినుండి బోనాల ఉత్సవాలు జరుపుతున్నామని ప్రచారంలో ఉంది.

          మన తెలుగు వారి ఇంట్లో సంప్రదాయం ప్రకారం ఆషాడంలో ఆడపడుచులు తమ పుట్టింటికి వస్తారు. అలాగే పుట్టింటికి వచ్చిన అమ్మవారిని బాణంతో ప్రసన్నం చేసుకొని, ఆమెను ఆనందపరుస్తారు అని ఇంకో నమ్మకం.

బోనం అంటే ?

Bonam Meaning

          బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుండి వచ్చింది. అనగా అమ్మవారికి అప్పుడే వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.



బోనం అలంకరణ

Bonam Preparation

          ఎల్లమ్మ, మారెమ్మ, పెద్దమ్మ, ఆంకాళమ్మ, పోలేరమ్మ అనే పేర్లతో అమ్మవారిని కొలుస్తారు.

          అమ్మవారికి అప్పుడే వండిన అన్నాన్ని కుండలో ఉంచి, బెల్లం లేదా చక్కర కలిపి పెడతారు. దీనిపై పసుపు నీళ్లు ఇంకొక చిన్ని కుండలో ఉంచుతారు. ఈ రెండు కుండల మధ్య వేప కొమ్మలను అలంకరణకు ఉపయోగిస్తారు.

          బోనం పైన ఒక దీపాన్ని ఉంచుతారు. కుండను సగభాగం సున్నంతో రుద్ది, సగభాగం పసుపు, సుంకుమా లతో అలంకరిస్తారు.

బోనం సమర్పించే విధానం

Bonam Presentation

          ఇంటి ఆడపడుచులు పట్టుబట్టలు ధరించి పూలు, గాజులు, బొట్టుతో అలంకరించుకొని, వొంటిపై పసుపు రాసుకొని బోనాన్ని తలపై ధరిస్తారు, డప్పులు, ఉఊరేగింపులతో వెళ్లి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. సాకం, పాకం రెండింటినీ అమ్మకు సమర్పిస్తారు.

సాకం :      సాకం అంటే వండని పదార్థం అని అర్థం, పసుపునీళ్లు, వేపాకును సాకంగా సమర్పిస్తారు, కొందరు కల్లును కుడా సాకంగా సమర్పిస్తారు.

పాకం :      పాకం అంటే వొందిన పదార్థం అని అర్థం, అన్నం, బెల్లంతో కలిపి అమ్మకు సమర్పిస్తారు. ఇలా సమర్పించడం ద్వారా అన్న పానాలకు కొదువ ఉండదని నమ్మకం.

»   ఆది, మంగళ, గురు వారాల్లో ఈ ఉత్సవాలు విశేషంగా జరుపుతారు.
»   గోల్కొండ, జగదాంబ ఆలయంలో మొదటగా బోనాలు ప్రారంభం అవుతాయి, పాతబస్తీ శాలిబండ అక్కన్న మాదన్న ఆలయంలో, లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయంలో, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలోనూ ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుతారు.



ప్రత్యేకతలు

Special in Bonalu

1. పోతురాజు:      పోతురాజు వేషాలు ఈ ఉత్సవంలో కనిపిస్తాయి. శరీరానికి పసుపు రుద్దుకొని చేతిలో చర్నాకోలాతో నాట్యం చేస్తూ కనబడతారు. వీరిని అమ్మవారికి సోదరుడిగా భావిస్తారు. వారు ఆడేటప్పుడు చర్నాకోల తాకినా వారు తమ అదృష్టంగా భావిస్తారు.

2. రంగం:      పచ్చికుండపై నిలబడి మహిళా పూనకంతో భవిష్యత్తులో జరిగే విషయాలను చెప్తుంది, ప్రజలు వాటిని విని ముందుగా జాగ్రత్తలు పాటిస్తారు. ఇది బోనాల ఉత్సవంలో ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుంది.

శాస్త్రీయంగా బోనాలు ప్రాముఖ్యత :

Scientific advantages of bonalu :

»   ఔషధ విలువలు గల వేపాకు ఆషాడ మాసంలో వొచ్చే మశూచి వంటి రోగాలకు విరుగుడుగా పనిచేస్తుంది.
»   పసుపు కుంకుమలు శరీరానికి పూయటం ద్వారా అవి ఆంటీసెప్టిక్ గా పని చేస్తాయి.


బతుకమ్మ    బోనాలు    దసరా    దీపావళి    సంక్రాంతి    ఉగాది    మహా శివరాత్రి    మేడారం సమ్మక్క సారక్క జాతర    మరిన్ని ..