Deepavali / Diwali in Telugu
దీపావళి పండుగ తెలుగులో
దీపావళి పండుగ
Deepavali / Diwali Festival
ప్రతీ యేటా ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకునే దీపకాంతుల వెల్లువ దీపావళి పండుగ. దీపాల వరుసయే దీపావళి.
దీపావళి పండుగ చరిత్ర
History of Diwali Festival in telugu
మన పురాణాల ప్రకారం లంకలోని రావణాసురుని రాముడు సంహరించి సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందోత్సవాలతో దీపాలు వెలిగించారని, అదే దీపావళిగా మారిందని ప్రతీతి.
ఇంకొక పురాణగాథ ప్రకారం, పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు. నరకాసురుడు ఎవరి చేతిలోనూ చావు లేకుండా, కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే చనిపోయే విధంగా బ్రహ్మదేవుడితో వరం పొందాడు. నరకాసురుడు చివరికి సత్యభామా దేవి తేటిలో ఆశ్వీయుజ చతుర్దశి రోజున మరణించాడు. ఆ రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటాము.
దీపావళి జరుపుకునే విధానం
Way of Celebrating Diwali in telugu
దీపావళి రోజున సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. పరిసరాలంత దీప కాంతులతో విరాజిల్లుతుంది. దీపం సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలు. దీపాలతో పాటు బాణాసంచాలు కూడా కాల్చుతారు. దీపావళి రోజున సాయంకాలం మహాలక్ష్మి దేవికి పూజలు చేయటం జరుగుతుంది.
లక్ష్మీదేవి పూజా వృత్తంతం
History behind Laxmi Pooja on Deepavali
పూర్వం దుర్వాసుడు అనే మహర్షి ఇంద్రుని ఆతిథ్యానికి మెచ్చుకొని, ఒక మహిమ గల హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు ఈ హారాన్ని తానూ స్వీకరించకుండా అహమకారంతో తన వద్ద నున్న ఐరావతం మేడలో వేస్తాడు. ఆ ఐరావతం ఆ హారాన్ని కాలితో తొక్కి వేస్తుంది. అది చుసిన ఋషి ఇంద్రుణ్ణి శపిస్తాడు.
మహర్షి శాపం వాళ్ళ ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోతాడు, సంపదలు పోగొట్టుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు శ్రీ మహా విష్ణువుని ఆశ్రయించగా ఇంద్రుణ్ణి ఒక జ్యోతి వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. ఇంద్రుని పూజకు మెచ్చిన లష్మిదేవి ఇంద్రునికి తిరిగి రాజ్యాన్ని, సంపదలను ప్రసాదించిందని పురాణాలు చెపుతున్నాయి.
అప్పుడు శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవిని నీ భక్తులను ఆలా కరుణిస్తావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి తనను ఎవరైతే భక్తి శ్రద్దలతో కొలుస్తారో వారికి అష్ట లష్మిగా కోరిన కోరికలు నెరవేర్చుతానని చెప్పింది. అందువల్ల దీపావళి రోజున శ్రీ మహాలష్మి పూజను ఆచరిస్తారు.
చేదు నశింపజేయడానికి ధర్మాన్ని స్థాపించటానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుంది. లక్ష్మీదేవికి నిదర్శనంగా వెలిగించే దీపాలు విరజిమ్మే వెలుగులో ప్రజలు సర్వ శుభాలు పొందుతారు.
బతుకమ్మ బోనాలు దసరా దీపావళి సంక్రాంతి ఉగాది మహా శివరాత్రి మేడారం సమ్మక్క సారక్క జాతర మరిన్ని ..