Maha Shivaratri
మహా శివరాత్రి
మహా శివరాత్రి
మాఘ కృష్ణ చతుర్దశి రోజును జరుపుకునే తెలుగు పండుగ మహా శివరాత్రి, శివరాత్రిని తెలుగువారు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
మహా శివరాత్రి చరిత్ర
History - Maha Shivaratri Story in Telugu
కైలాసంలో పరమేశ్వరుడు నిత్యం తపస్సులో ఉండేవాడు. కైలాసానికి సమీపంలో పర్వత రాజు హిమవంతుడు, అతని భార్య మేనకా నివాసం ఉండేవారు. వారి కుమార్తె పార్వతీ దేవి. పార్వతీ దేవి శివుడిని ఆరాదించేది, శివుడిని వివాహం చేసుకోవాలనే నిశ్చయంతో ఉండేది. ఒకరోజు నారద మహర్షి పార్వతీ దేవి అభీష్టాన్ని హిమవంతుడికి వివరిస్తాడు. అపుడు హిమవంతుడు పార్వతీ దేవిని శివుడి పూజకు పంపుతాడు. ధ్యానంలో ఉన్న శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి పార్వతీ దేవి పూజలు చేస్తూ కైలాసంలోనే ఉండేది.
ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమణ చేసాడు. అతని ఆగడాలకు అంతులేకుండా పోయింది. దేవతలందరు కలత చెంది బ్రహ్మ దేవుడిని ఆశ్రయిస్తారు. తారకాసురుని అంతం శివుడికి జన్మించే కుమారుని చేతిలో ఉందని తెలిసిన బ్రహ్మదేవుడు శివ పార్వతుల వివాహం గురించి తలంచి, మన్మదుడిని పిలిపిస్తాడు. మన్మధుడు, అతని భార్య రతీదేవి కలిసి శివుని తపస్సును భంగం చేయటానికి వెళతారు. మన్మధుడు బాణాలను శివుడిపై విసరగా, తపోభంగం కలిగిన శివుడు ఉగ్రరూపంతో మూడవ కన్ను తెరవగా, మన్మధుడు భస్మం చెందాడు.
ఇదంతా గమనించిన పార్వతీ దేవి శివుడిని కేవలం భక్తితో మాత్రమే ప్రసన్నం చేసుకోగలమని అక్కడినుండి బయలుదేరి, తాను శివుడి ప్రసన్నం కోసం తపస్సు చేయటం ప్రారంభించింది.
పార్వతీ దేవి తపస్సులో ఉండగా శివుడు ఒక మహర్షి రూపంలో వచ్చాడు. అతను పార్వతితో శివుడు మోసగాడనీ, అతన్ని నమ్మవద్దనీ చెపుతాడు. శివుడిని పరమ భక్తురాలైన పార్వతీ దేవి ఆ మునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు ముని శివుడిగా మారి, తన భక్తికి మెచ్చానని, తనను వివాహం చేసుకుంటానని చెపుతాడు.
సకల దేవతలా సమక్షంలో శివపార్వతుల వివాహం జరుగుతుంది. ఈ సందర్భంగానే "మహా శివరాత్రి" ని జరుపుకుంటాము.
శివరాత్రి జరుపుకునే విధానం
Way of Celebrating Shivaratri
శివరాత్రి పూజను దీక్షగా నిర్వహించవలసి ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాస దీక్ష మరియు జాగరణలు శివరాత్రి ప్రత్యేకతలు. ఉపవాసం అనగా కేవలం ఒంటిపూట భోజనం మాత్రమే కాదు, భూషణం, సాత్విక ఆహారం తీసుకోవటం, శారీరక మానసిక శౌచలం కలిగి ఉండటం వంటివి ఉండాలి. ప్రదోష వేళ అనగా సూర్యాస్తమయం, చంద్రోదయానికి మధ్య కలం నుండి శివుడికి అభిషేకం, పూజలు అర్ధరాత్రి లింగోద్బవ సమయం వరకూ అభిషేకాలు చేస్తూ ఉండాలి.
మారేడు దళాలపై దీపపు దిమ్మెలను ఉంచి, ఆవునెయ్యితో దీపాలను వెలిగించాలి. శివరాత్రి నాడు విలిగించే దీపాలలో 3 వత్తులను వేయాలి. శివలింగానికి పానమట్టం ఉన్న వైపు దీపాలు వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుందనీ, పానమట్టానికి అవతలి వైపు దీపాలు వెలిగిస్తే వైరాగ్యం కలుగుతుందనీ నమ్మకం. రాత్రి జాగరణ తరువాత మరుసటిరోజు పూజలు నిర్వహించి, శివుడికి నైవేద్యాలు సమర్పించి, తాము స్వీకరించి ఉపవాస దీక్షను విరమిస్తారు.
శివరాత్రి విశిష్టత
Importance of Shivaratri
శివుడిని బోళాశంకరుడు అంటారు, అంటే భక్తులను తొందరగా కరుణించి వారిని ఆదుకునే దైవంగా శివుడు ప్రసిద్ధి చెందాడు. శివరాత్రి చాలామంది భక్తులకు ఇష్టమైన పండుగగా, శివుడు ఇష్టదైవంగా నిలిచాడు.
బతుకమ్మ బోనాలు దసరా దీపావళి సంక్రాంతి ఉగాది మహా శివరాత్రి మేడారం సమ్మక్క సారక్క జాతర మరిన్ని ..