మేడారం సమ్మక్క సారక్క జాతర
Medaram Sammakka Sarakka Jatara
మేడారం సమ్మక్క సారక్క జాతర
Medaram Sammakka Sarakka Jatara
మన దేశంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవం మేడారం జాతర. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ఈ ఉత్సవం ఘనంగా జరుపుతారు.
మేడారం సమ్మక్క సారక్క చరిత్ర
History of Medarm Sammakka Sarakka Jatara
సుమారు 700 సంవత్సరాల చరిత్ర గలది సమ్మక్క సారక్క జాతర, దీన్నే మేడారం జాతర అని కూడా పిలుస్తారు.
» 13 వ శతాబ్దంలో మేడారం కాకతీయుల పరిపాలనలో ఉండేది. మేడారం సమీపంలో గల అడవిలో గిరిజనులు ఒకరోజు వేటకు వెళ్లగా అక్కడ సింహాలు కాపలాగా ఉన్న పసిపాపను గమనించారు. ఆ పాపను వారు స్వీకరించి దైవ స్వరూపంగా భావించారు. తాము ఆమెకు సమ్మక్క అని నామకరణం చేసారు. పెరిగి పెద్దయిన తర్వాత గిరిజన రాజైన పగిడిద్ద రాజుతో వివాహం చేసారు. వారికి జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అనే సంతానం కలిగారు.
» అంతా సజావుగా గడుస్తుండగా మేడారంలో కరువు సంభవించింది. అలంటి పరిస్థితుల్లో కప్పం కట్టమని మేడారాన్ని పాలిస్తున్న కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పగిడిద్ద రాజుకు ఆదేశం పంపాడు. తమకు పంటలు లేవని, కప్పం చల్లించలేమని పగిడిద్ద రాజు వేడుకున్నాడు. అదంతా పట్టించుకోని ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు.
» "సంపంగి వాగు" అనే ప్రాంతం దగ్గర భీకర యుద్ధం ప్రారంభం అయ్యింది. అసంఖ్యాకంగా ఉన్న కాకతీయ సైన్యం, గిరిజనుల చేతిలో కుప్పకూలిపోసాగారు. ఇది గమనించిన శత్రుసైన్యం పగిడిద్ద రాజునూ వెనకనుండి పొడిచి చంపారు. ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క అల్లుడు గోవిందరాజు, కూతురు సారలమ్మ యుద్ధంలో ప్రవేశించారు. సమ్మక్క అసామాన్య యుద్ధ ప్రతిమకు కాకతీయ సైన్యం కనుమరుగు కాసాగింది. దీనితో భ్రాంతి చెందిన శత్రుసైన్యం సమ్మక్క, సారలమ్మలను కుడా వెనుకనుండి పొడిచారు. జంపన్నను చంపి, వాగులో పడేశారు, అప్పటినుండి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.
» సమ్మక్క మాత్రం శరీరం నిండా ఉన్న బాణాలతో నడుస్తూ ముందుకు సాగింది, ఆమెను వెతుక్కుంటూ గిరిజనులు వెళ్లారు. కానీ అక్కడ సమ్మక్క కనిపించలేదు కానీ వారికి చిలక గుట్ట ప్రాంతం వద్ద ఉన్న నాగవృక్షం క్రింద ఒక కుంకుమ భరణి కనిపించింది, సమ్మక్కయి కుంకుమ భరణిగా మారిందని వారు నమ్ముతారు. సారలమ్మ మేడారంలోని కన్నెపల్లిలో వెలిసిందని నమ్ముతారు.
» అప్పటినుండి ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్కను చిలకల గుట్టనుంది మేడారం కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ దగ్గరికి తీసుకువొస్తరు. సమ్మక్క, సారలమ్మను గద్దెలు ఏర్పాటు చేస్తారు. ఈ గద్దెలలో వారికి నిలిపి కొలుస్తారు. జాతర అనంతరం సమ్మక్క, సారలమ్మలను వారి స్వయంగా వెలసిన స్థలాలకు తిరిగి చేరుస్తారు.
మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేకత
Specialty in Medaram Sammakka Sarakka jatara
» గిరిజన వీరుల శౌర్యానికి గుర్తింపుగా నిలుస్తుంది ఈ మేడారం జాతర.
» మొక్కులు తీర్చుకునే భక్తులు కిలోల కొద్దీ బెల్లాన్ని తక్కెడలో కొలిచి సమర్పిస్తారు.
» ఇక్కడ బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు. ఈ బంగారాన్ని తలపై మోస్తూ తీసుకు వెళతారు.
బతుకమ్మ బోనాలు దసరా దీపావళి సంక్రాంతి ఉగాది మహా శివరాత్రి మేడారం సమ్మక్క సారక్క జాతర మరిన్ని ..