Podupu Kathalu in Telugu
తెలుగు పొడుపు కథలు
What Are Podupu Kathalu?
కాలక్షేపం కోసం అడిగే చిన్న చిక్కు ప్రశ్నలను పొడుపు కథలు అంటారు.
Podupu Kathalu are small trickey questions asked for the sake of fun, podupu kathalu are called as riddles in English.
చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది?
సమాధానం :
ఉల్లిపాయ
జాన కాని జాన, ఏమి జాన?
సమాధానం :
ఖజాన
తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది?
సమాధానం :
వేరుశెనగ కాయ
లాగి విడిస్తేనే బ్రతుకు?
సమాధానం :
ఊపిరి
పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు?
సమాధానం :
పత్తి పువ్వు
పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే?
సమాధానం :
దీపం
పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు?
సమాధానం :
సూర్యుడు
మూత తెరిస్తే, ముత్యాల పేరు?
సమాధానం :
దంతాలు
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు?
సమాధానం :
తేనె పట్టు
మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ?
సమాధానం :
లవంగ మొగ్గ
ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?
సమాధానం :
తేనె పట్టు
రసం కాని రసం, ఏమి రసం?
సమాధానం :
నీరసం
మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన?
సమాధానం :
పాలు, పెరుగు, నెయ్యి
మోదం కాని మోదం?
సమాధానం :
ఆమోదం
రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది?
సమాధానం :
ఉత్తరం
కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి?
సమాధానం :
సీతాకోక చిలుక