Podupu Kathalu in Telugu
తెలుగు పొడుపు కథలు
నూరు పళ్ళు ఒకటే నోరు?
సమాధానం :
దానిమ్మ
సన్నని స్తంభం, ఎక్కలేరు, దిగలేరు?
సమాధానం :
సూది
ఎర్రవాడొస్తే తెల్లవాడు, పారిపోయి దాక్కుంటాడు?
సమాధానం :
సూర్యుడు, చంద్రుడు
పొంచిన దయ్యం! ఉన్న చోట ప్రత్యక్షం!!
సమాధానం :
నీడ
అంగట్లో ఉంటాను, ఇంట్లో అంగి విప్పుతాను! నన్ను గాని ముట్టుకుంటే నూతిలో దూకుతాను!!
సమాధానం :
అరటి పండు
ఇంట్లో మొగ్గ, వీధిలో పువ్వు?
సమాధానం :
గొడుగు
అడవిలో పుట్టాను, నల్లగా అయ్యాను, ఇంటికి వచ్చాను, ఎర్రగా మారాను, తొట్టిలో పడ్డాను తెల్లగా మారాను?
సమాధానం :
బొగ్గు
పైన పచ్చ ఏనుగు, లోన తెల్ల పీనుగు?
సమాధానం :
అరటి కాయ
బారు కాని బారు, ఏమి బారు?
సమాధానం :
సాంబారు
పిల్లలకు ఉచితము! పెద్దలకు బహుమానము!! యూవతీ యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము?
సమాధానం :
ముద్దు
హారము కాని హారము, ఏమి హారము?
సమాధానం :
ఆహారము
పుట్టినపుడు పురుగు! పెరిగితే పువ్వుల రాజు?
సమాధానం :
భ్రమరము
బడి కాని బడి, ఏమి బడి?
సమాధానం :
రాబడి
పగలు తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాక్షసి!?
సమాధానం :
గబ్బిలం
బొట్టు కాని బొట్టు, ఏమి బొట్టు?
సమాధానం :
తాళిబొట్టు
పచ్చని గుడిలో ఎరుపు రత్నాలు?
సమాధానం :
దానిమ్మ గింజలు