Podupu Kathalu in Telugu

తెలుగు పొడుపు కథలు

మనిషి మనిషి మధ్య రథ సారథి నేను, నేను లేకుంటే ప్రపంచమే లేదు?
సమాధానం :
ప్రేమ

రెక్కలుంటాయి, రయ్ రయ్ మంటుంది, ఎగురలేదు కాని ఎగురవేస్తుంది?
సమాధానం :
ఫ్యాన్

రణము కాని రణము, ఏమి రణము?
సమాధానం :
చరణము

బంగారు బిడ్డలు, వెచ్చని దుస్తులు, గుర్రపు వెంట్రుకలు?
సమాధానం :
మొక్కజొన్న

రాయి కాని రాయి, ఏమి రాయి?
సమాధానం :
కిరాయి

ఉన్న చోటే ఉంటుంది, వేళా పాలా చెపుతుంది?
సమాధానం :
గోడ గడియారం

రంగము కాని రంగము, ఏమి రంగము?
సమాధానం :
చదరంగము

మతము కాని మతము, ఏమి మతము?
సమాధానం :
కమతము

అన్నకు అందవు కాని తమ్ముడికి అందుతాయి?
సమాధానం :
పెదవులు

వాలు కాని వాలు, ఏమి వాలు?
సమాధానం :
ఆనవాలు



రేట్లెంత పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వొచ్చేవి?
సమాధానం :
రెండు ఐదు పైసల బిళ్ళలు

వల కాని వల, ఏమి వల?
సమాధానం :
నవల

రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు?
సమాధానం :
చంద్రుడు

గుప్పెడంత లోగిలిలో యాభై మంది నివాసం?
సమాధానం :
అగ్గి పెట్టె

వారు కాని వారు, ఏమి వారు?
సమాధానం :
నవారు

విత్తనం లేకుండా మొలిచేది?
సమాధానం :
గడ్డము

Page-13