Podupu Kathalu in Telugu
తెలుగు పొడుపు కథలు
ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలుస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెపుతుంది?
సమాధానం :
టెలిఫోన్
పైన చుస్తే పండు, తెరిచి చూస్తే బొచ్చు, ఏమిటది?
సమాధానం :
పత్తికాయ
పుట్టినపుడు ఉండవు, పోయే టప్పుడు ఉండవు, ఏమిటవి?
సమాధానం :
బట్టలు
పుట్టినపుడు లేకుండా తరువాత వచ్చి ఆ తరువాత పోయేవి?
సమాధానం :
దంతములు
చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగి పోతుంది?
సమాధానం :
ముగ్గు
సాయి కాని సాయి, ఏమి సాయి?
సమాధానం :
కసాయి
మంచి సువాసన ఉన్నా, పూజకు పనికి రానిది, ఏమిటది?
సమాధానం :
మొగిలి పువ్వు
పేరు కాని పేరు, ఏమి పేరు?
సమాధానం :
కాసుల పేరు
కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయినా నడుస్తుంది?
సమాధానం :
మేఘం
తల నుండి పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు, గొంతులో నిప్పులు దాచుకుంటుంది కానీ రాకాసి కాదు, పాకుతుంది కానీ పాము కాదు?
సమాధానం :
రైలు
తెలియకుండా పూవు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది?
సమాధానం :
అత్తి చెట్టు
జానెడు ఇంటిలో, మూరెడు బెత్తం?
సమాధానం :
కుండ, గరిట
గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది?
సమాధానం :
తాటి చెట్టు
కొప్పు ఉన్నా జుట్టు లేదు, కళ్ళు ఉన్నా చూడలేదు?
సమాధానం :
టెంకాయ
ఐదుగురిలో బుడ్డోడు! పెళ్ళికి మాత్రం పెద్దోడు!!?
సమాధానం :
చిటికెన వ్రేలు
ఒక ముండ ఎన్ని కోకోలైన విప్పుతుంది?
సమాధానం :
ఉల్లిపాయ