Podupu Kathalu in Telugu
తెలుగు పొడుపు కథలు
అమ్మంటే దగ్గరకొచ్చి నాన్నంటే దూరంగా పోతాయి?
సమాధానం :
పెదవులు
ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి?
సమాధానం :
తక్కెడ
అడుగులున్నా, కాళ్ళులేనిది?
సమాధానం :
గజము బద్ద, మీటర్ స్కేలు
ఒకరు పొడుస్తారు, ఒకరు విడుస్తారు?
సమాధానం :
పొడుపు కథ
నల్ల స్తంభం పైన నలుగురు దొంగలు?
సమాధానం :
లవంగం మొగ్గ
అందని వస్త్రం పై అన్నీ వడియాలే?
సమాధానం :
నక్షత్రాలు
కాయలు కాని కాయలు, ఏమి కాయలు?
సమాధానం :
మొట్టి కాయలు
అందరికి చెప్పి వొచ్చేది, చెప్పకుండా వెళ్ళేది?
సమాధానం :
ప్రాణం
అందమైన చిన్నది, అందాల చిన్నది, నువ్వు చుస్తే నిన్ను చూస్తుంది, నేను చుస్తే నన్ను చూస్తుంది?
సమాధానం :
అద్దము
కీచు కీచు పిట్ట! నేలకేసి కొట్ట!!
సమాధానం :
చీమిడి
కిట కిట తలుపులు! కిటారు తలుపులు!! ఎప్పుడు తీసినా చప్పుడు కాదు?
సమాధానం :
కను రెప్పలు
కిరీటము ఉంటుంది కాని రాజును కాదు, నాట్యము చేస్తాను కాని మయూరిని కాదు?
సమాధానం :
నాగుపాము
కాటుక రంగు, కమలము హంగు! విప్పిన పొంగు, ముడిచిన క్రుంగు!!?
సమాధానం :
గొడుగు
తల లేదు కాని గొడుగు ఉంది, పాము లేదు కాని పుట్ట ఉంది?
సమాధానం :
పుట్ట గొడుగు
కడుపు లోన పిల్లలు, కంఠము లోన నిప్పులు! అరుపేమో ఉరుము, ఎరుపంటే భయము!!?
సమాధానం :
రైలు
కార్డు కాని కార్డు, ఏమి కార్డు?
సమాధానం :
రికార్డు