శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము

Satyanarayana Swamy Vratham

సత్యనారాయణ స్వామి వ్రతము

Sree Satyanarayana Swamy Vratham

          తెలుగు వారి సంప్రదాయాలలో ముఖ్యమైన ఘట్టం "శ్రీ సత్యనారాయణ స్వామి" వ్రతము.

          అడిగిన వెంటనే వరాలనిచ్చే దేవుడు శ్రీ సత్యదేవుడు. 7 లోకాలకు అధిపతి అయిన ఈ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కోరికలు తీరుతాయని, కష్టాలు తొలగిపోతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం, కాబట్టి నూతన దంపతులు మరియు శుభకార్యాలు తలపెట్టేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

          మహిమ గల శ్రీ సత్యనారాయణ స్వామి వారు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం అన్నవరంలో పంపానది వొడ్డున ఉన్న రత్నగిరి కొండపై సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో వెలిశాడు.

          శ్రీ మహావిష్ణువును రామావతారంలో ప్రసన్నం చేసుకోవటానికి పూర్వం రత్నాకరుడు అనే భక్తుడు తపస్సు చేయగా, స్వామి ప్రత్యక్షమై వరం ఇవ్వగా తన శిరస్సుపై స్వామిని మోసే భాగ్యం కల్పించమని కోరాడు.

          దీనికి ఫలితంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కలియుగంలో భక్తులను ఆదరించుటకు క్రీ.శ. 1891 లో కరనామ సంవత్సరం శ్రావణ శుద్ధ విదియ నాడు రత్నగిరి కొండపై వెలిశాడు. ఈ క్షేత్రంలో నిత్యం సత్యనారాయణునికి వ్రతాలు జరుగుతూ ఉంటాయి.



సత్యనారాయణ స్వామి వ్రత ప్రాముఖ్యత

Importance / Benefits of Satyanarayana Swamy Vratham

          కష్ట సమయములలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది, విచారములు తొలగిపోతాయి. ధన ధాన్యములు వృద్ధి చెందును, అన్ని కార్యాలలో మంచి జరుగుతుంది. నూతన కార్యములు చేపట్టే వారికి విజయం కలగడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీలకు సంతానం, సౌభాగ్యం కలుగుతుంది.

సత్యనారాయణ స్వామి వ్రత విధానం

satyanarayana swamy vratham vidhanam

          అన్నవరం లోనే కాక స్వగృహాలు, కొన్ని దైవ స్థలాల్లో కూడా ఈ వ్రతమును ఆచరించవచ్చు. వ్రతం ఆచరించే దంపతులిద్దరూ అభ్యంగన స్నానం ఆచరించాలి. నూతన వస్త్రాలను ధరించాలి. వ్రత ఆచరణ సంకల్పం కలిగి ఉండాలి.

          శక్తి మేరకు పూజా సామాగ్రిని సమకూర్చుకోవాలి, సామాగ్రిని శుభ్రంగా కడగాలి. వ్రతం ఆచరించే స్థలాన్ని గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఆ స్థలంలో వ్రతపీఠం ను ఉంచాలి. పీఠాన్ని మామిడి ఆకులు, కొమ్మలు, అరటి ఆకులు, బంతి పూలతో అలంకరించాలి. వ్రత పీఠం ముందు ముగ్గుతో అలంకరించాలి. వ్రతపీఠం లోపల స్వామి వెండి లేదా రాగి విగ్రహాన్ని ఉంచి దీపాలు వెలిగించాలి.

          బ్రామ్మణుడు చెప్పినట్లు నవ గ్రహాలను, అష్ట దిక్పాలకులను, సప్త ఋషులను ఆహ్వానించి వ్రతాన్ని ఆరంభించాలి. వ్రతం 5 కథలలో సాగుతుంది. 5 కథలు ముగిసిన తరువాత స్వామికి పంచామృతం ( పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కర ) సమర్పించటం జరుగుతుంది. ధూపము మరియు హారతితో వ్రతం ముగుస్తుంది.

          వ్రతం అనంతరం బ్రామ్మణుడిని దానం ఇవ్వడం, అధితులకు, బ్రాహ్మణులకు ప్రసాదం ఇవ్వటం, భోజనాలు ఏర్పాటు చేయటం, తాము స్వీకరించటం జరుగుతుంది.


తెలుగు లింగాష్టకం    వరలక్ష్మీ వ్రతం    శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము    తెలుగు హనుమాన్ చాలీసా    మరిన్ని ..