Active Voice, Passive Voice
Active Voice:
కర్త (subject) చేత ప్రారంభించబడి కర్తకు ప్రాధాన్యత ఇచ్చే వాక్యాన్ని "Active Voice" అని అంటారు.
Eg: Rama killed Ravana.
పై వాక్యం కర్తచే ప్రారంభించబడింది, అందులో కర్తకు ప్రాధాన్యత ఇవ్వబడింది కావున అది Active Voice లో ఉంది అని అంటారు.
Passive Voice:
కర్మ (object) చేత ప్రారంభించబడి / కర్మ (object) కు ప్రాధాన్యత ఇవ్వబడే వాక్యాలను "Passive Voice" అని అంటారు.
Eg: Ravana was killed by Rama.
సాధారణ వాక్యం Active Voice నుండి Passive Voice లోకి ఒక వాక్యం మారేటప్పుడు ఈ క్రింది మార్పులు వాక్యంలో చోటుచేసుకుంటాయి.
1. వాక్యంలోని Subject, "Object" గా మారుతుంది.
2. Passive Voice లో Object వెంటనే తగిన helping verb వస్తుంది.
3. Helping verb వెంటనే verb యొక్క 3 వ రూపం (V3) వస్తుంది.
4. V3 తరువాత by అనే preposition వస్తుంది.
5. Preposition తరువాత subject ను వ్రాయాలి.
Active Voice లోని subject లు passive voice లో క్రింది విధంగా మారుతాయి.
I-Me, We-Us, You-You, They-Them, He-Him, She-Her.
Some sentences in Active Voice and Passive voice:
She is cutting fruits. (A.V)
Fruits are being cut by her. (P.V)
He asked doubts. (A.V)
Doubts have been asked by him. (P.V)
I Will attend seminar. (A.V)
Seminar will be attended by him. (P.V)