Tenses
Tenses:
Tense అనగా "కాలం"(time) అని అర్థం. ఇది క్రియ(verb) యొక్క రూపం. అంటే క్రియా రూపాన్ని (verb form) తెలియజేసే దానిని "Tense" అని అంటారు. ఇంగ్లీషులో ముక్యంగా 3 రకాల Tenses ఉన్నాయి. అవి:
1. Present tense (వర్తమాన కాలము)
2. Past tense (భూత కాలము)
3. Future tense (భవిష్యత్ కాలము)
పై మూడు Tense లను ఒక్కోదానిని మళ్ళీ 4 రకాలుగా విభజించడం జరిగింది. అంటే మొత్తం 12 రకాలు, వాటిని ఒక్కొక్కటిగా క్రింద తెలుసుకుందాం.
1. Simple Present Tense:
అలవాటుగా చేసే పనులను, నిత్య సత్యాలను, సాధారణ పనులను, రోజువారీ చేసే పనులను తెలియజేయడానికి "Simple Present Tense" ను ఉపయోగిస్తారు.
Structure: Subject+V1
Eg:
1. I speak telugu everyday.
2. Raju drinks tea.
3.We eat rice daily.
4.They go to temple every sunday.
Note: Subject he, she, it లలో ఉన్నపుడు verb కు s గానీ es గానీ ies గానీ చేర్చాలి.
verb ch, sh, s, o, x లతో ముగిస్తే "es" ను, y తో ముగిస్తే "ies" ను, ఒకవేళ ముందు చెప్పిన అక్షరాలతో verb ముగియకపోతే "s" ను verb కు చేర్చాలి.
2. Present Continuous Tense:
మనం చూస్తూ ఉన్న సమయంలో గానీ, మాట్లాడుతూ ఉన్న సమయంలో గానీ, జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి "Present Continuous Tense" ను ఉపయోగిస్తారు.
Structure: Subject+am/is/are+V1+ing
Eg:
1. I am going to temple.
2. She is watching movie.
3. They are reading books.
4. You are talking to me.
Note: ఈ tense లో am/is/are అనే helping verbs కలవు, I వచ్చినపుడు am ను, we/you/they వచ్చినపుడు are ను, he/she/it వచ్చినపుడు is ను ఉపయోగించాలి.
3. Present Perfect Tense:
కొంతసేపటి క్రితంగాని, కొంతకాలం క్రితంగాని ప్రారంభించి పూర్తి చేసిన పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.
Structure: Subject+have/has+V3
Eg:
1. I have taken dinner.
2. She has watched movie just now.
3. They have gone to temple.
4. Dog has drunk water.
Note: I, We, You, They లు వచ్చినపుడు "have" అనే helping verb ను ఉపయోగిస్తారు, He, She, It లు వచ్చినపుడు "has" అనే helping verb ను ఉపయోగించాలి.
4. Present Perfect Continuous Tense:
గతంలో ఎప్పుడో మొదలై ఇప్పటివరకు జరిగి ఇకముందు కూడా జరగడానికి అవకాశం ఉన్న పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.
Structure: Subject+have/has+been+V1+ing
Eg:
1. They have been working on this project since 2007.
2. She has been doing this work from 2016.
5. Simple Past Tense:
గతంలో ప్రారంభించి పూర్తిచేయబడిన పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.
Structure: Subject+V2
Eg:
1. I Watched a movie last night.
2. We played a game yesterday.
3. They graduated in 2015.
6. Past Continuous Tense:
గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.
Structure: Subject+was/were+V1+ing
Note: We, You, They subject లకు were అనే helping verb ను మరియు I, He, She, It subject లకు was అనే helping verb ను ఉపయోగించాలి.
Eg:
1. I was watching T.V.
2. We were playing football.
3. It was making noice.
7. Past Perfect Tense:
గతంలో ఒక నిర్దిష్ట సమయంకన్నా ముందే జరిగిన పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.
Structure: Subject+had+V3
Eg:
1. I had gone to bed by 10 pm.
2. She had graduated in 2015.
3. They had watched that movie last week.
8. Past Perfect Continuous Tense:
గతంలో ఎప్పుడో ప్రారంభం అయిన ఒక పని ఒక సమయం నుండి మరొక సమయం వరకూ కొనసాగి తరువాత కూడా కొనసాగటానికి అవకాశం ఉంటే అలాంటి వాక్యాలను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.
Structure: Subject+had+been+V1+ing
Eg:
1. They had been writing exam when i went there.
2. He had been working on that project since i was a kid.
9. Simple Future Tense:
భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.
Structure: Subject+shall/will+V1
Eg:
1. I shall purchase a car tomorrow.
2. We shall consult a doctor next week.
3. They will go to cinema tomorrow.
I, We subject లకు "shall" అనే helping verb ను, మిగిలిన subject లకు "will" అనే helping verb ను ఉపయోగించాలి.
10. Future Continuous Tense:
భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో జరుగుతూ ఉండే పనులను తెలియజేయడానికి ఈ tense ను ఉపయోగిస్తారు.
Structure: Subject+shall/will+be+V1+ing
Eg:
1. I will be going to cinema at this time tomorrow.
2. She will be staying in london next year.
11. Future Perfect Tense:
భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయబడే పనులను ఈ tense ద్వారా చెపుతారు.
Structure: Subject+will/shall+have+V3
Eg:
1. They will have completed this work by tomorrow.
2. He will have come here by this time next week.
12. Future Perfect Continuous Tense:
భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకూ కొనసాగి తరువాత కూడా కొనసాగే పనులను ఈ tense లో తెలియజేస్తారు.
Structure: Subject+will/shall+have+been+V1+ing
Eg:
1. He will have been doing that work tomorrow.
2. She will have been driving a car tomorrow.