Ugadi
ఉగాది
ఉగాది పండుగ తెలుగులో
Ugadi Festival in telugu
ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు. తెలుగువారి మొదటి పండుగ ఉగాది.
ఉ - అంటే నక్షత్రం
గ - అంటే గమనం
నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాం.
ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది. అనగా సంవత్సరంలో మొదటి రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది. నూతన ఉత్సాహాలకు నంది మన తెలుగువారి ఉగాది.
ఉగాది పుట్టుక
Origin / History of Ugadi in telugu
చైత్ర శుద్ధ పాడ్యమి నాడి బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెపుతున్నాయి.
ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గరనుండి వేదాలను దొంగిలించాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం వెళ్లి సోమకారుణ్ణి వాదించి వేదాలను తీసుకొని వచ్చి, బ్రహ్మ దేవుడికి అప్పగించాడట. ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలు చెపుతున్నాయి.
ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి తెలుగు వారి మొదటి పండుగ, ఇల్లు, వాకిలి, శుభ్రపరుచుకోవటం, తలంటుస్నానాలు, కొత్తబట్టలు ధరించటం జరుగుతుంది. ఈ రోజున కొత్త పనులను ప్రారంభిస్తారు.
మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఈ పండుగను వివిధ పేర్లతో పిలుస్తారు.
ఆంధ్ర, కర్ణాటక - ఉగాది
మహారాష్ట్ర - గుడిపడ్వా
తమిళులు - పుత్తాండు
మళయాళీలు - విషు
పంజాబీలు - వైశాఖి
బెంగాలీలు - పొయ్ లా బైశాఖ్
అస్సాం - బిహు
కేరళా - కొళ్ళ వర్షం
ఉగాది ప్రత్యేకతలు
Special in ugadi
1. ఉగాది పచ్చడి ( ugadi pacchadi preparation )
వసంతఋతు ఆగమనం ప్రారంభమైన రోజు. ఈ రోజున షడ్రుచులు కలిపిన పచ్చడి తయారు చేసి తింటారు.
షడ్రుచులు గల ఈ పచ్చడిని తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు గల బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేపపువ్వు, మామిడికాయలు తగిన మోతాదులో మన రుచికి తగినట్టుగా కలిపి తయారు చేస్తారు.
2. పంచాంగ శ్రవణం
తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవొచ్చు. మరియు ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా అలోచించి తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావిస్తారు.
3. కవి సమ్మేళనం
సాయంకాలం కవులు ఒక చోట చేరి కవిసమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవితలు, పద్యాలు పాడుకోవటం జరుగుతుంది.
బతుకమ్మ బోనాలు దసరా దీపావళి సంక్రాంతి ఉగాది మహా శివరాత్రి మేడారం సమ్మక్క సారక్క జాతర మరిన్ని ..